schedule Tuesday, July 07, 2026

వార్డు సమస్యలు పరిష్కరించండి

calendar_today February 11, 2024
person dharshininews
వార్డు సమస్యలు పరిష్కరించండి
వార్డు సమస్యలు పరిష్కరించండి - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో సాహు శ్రీలత విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 24వ వార్డు సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత కోరారు. ఆదివారం వార్డులోని తుల్జా భవాని దేవాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహు శ్రీలత తన వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకవచ్చారు. దేవాలయ సమీపంలోని నాలా సుద్ద, నీటితో నిండిపోవడంతో పాటు ఈ మార్గంలోని దారిని కొందరు అక్రమించారని తెలిపారు. దీనీపై నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అదేవిధంగా బాలాజీ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శివాలయం మ్యూజీయం వద్ద కూడా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా వార్డు అభివృద్ధికి నిధులుకూడ కేటాయిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఆలయ కమిటి సభ్యులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23770/