schedule Tuesday, July 07, 2026

స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్‌గా రమేష్‌ మహరాజ్

calendar_today February 16, 2024
person dharshininews
స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్‌గా రమేష్‌ మహరాజ్
స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్‌గా రమేష్‌ మహరాజ్ - ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్‌ తమిళసై ఆమోదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్‌కు మెంబర్‌గా అవకాశం దక్కింది. గతంలో బీఆర్ఎస్ నియమించిన కమీషన్‌ పదవులకు నాయకులకు రాజీనామ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ పోస్టు భర్తికి ప్రతిపాదనకు పంపింది. చైర్మన్‌గా సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మరో ముగ్గురిని బోర్డు సభ్యుల పేర్లతో ఇచ్చిన ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. దీంతో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌ గా రాజయ్యతో పాటు బోర్డు సభ్యులుగా తాండూరుకు చెందిన టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహారాజ్, సంకేపల్లీ సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మల్హోత్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమీషన్ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ఫైనాన్స్ కమీషనర్ మెంబర్‌గా ఎం.రమేష్‌ మహరాజ్ నియామకం కావడం పట్ల తాండూరుకు చెందిన కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎం.రమేష్‌ మహరాజ్ కు అభినందనలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/23916/