schedule Tuesday, July 07, 2026

20న తాండూరుకు కేంద్ర మంత్రి రాక..!

calendar_today February 17, 2024
person dharshininews
20న తాండూరుకు కేంద్ర మంత్రి రాక..!
20న తాండూరుకు కేంద్ర మంత్రి రాక..! - బీజేపీ బస్సు యాత్రను జయప్రదం చేయండి - జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 20న తాండూరుకు కేంద్ర మంత్రి జోతిర్యాదిత్యా సింధియా వస్తున్నట్లు బీజేపీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధిష్టానం నిర్ణయం మేరకు తాండూరు నుంచి బీజేపీ రాజ రాజేశ్వరీ బస్సును ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఈ నెల 20 తాండూరు నుంచి బస్సు యాత్రను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి జోతిర్యాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హజరవుతున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులు బండి సంజయ్. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు కూడా పాల్గొంటారని చెప్పారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో నిర్వహించే సభకు, బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై బస్సు యాత్రను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/23946/