schedule Saturday, September 12, 2026

బీజేపీ నేత ఇంటికి బండి సంజయ్

calendar_today February 20, 2024
person dharshininews
బీజేపీ నేత ఇంటికి బండి సంజయ్
బీజేపీ నేత ఇంటికి బండి సంజయ్ - విందులో పాల్గొన్న కాటేపల్లి, కొండా తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బండి సంజయ్ తాండూరులోని బీజేపీ ఓబీస్ మోర్చ్ జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి నివాసానికి వెళ్లారు. మంగళవారం బీజేపీ పార్టీ చేపట్టిన రాజ రాజేశ్వరి(విజయ సంకల్ప) బస్సు యాత్ర ప్రారంభం కోసం బండి సంజయ్ తాండూరుకు వచ్చారు. ఈ క్రమంలో తాండూరు పట్టణానికి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చ్ జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి నివాసానికి బండి సంజయ్ తో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మహిళ నాయకురాలు రాణి రుద్రమలు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనంలో వారు పాల్గొన్నారు. వారి వెంట వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గ నాయకులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/24026/