schedule Saturday, September 12, 2026

పోట్లీ మహారాజ్‌ దేవాలయానికి మహర్ధశ

calendar_today February 21, 2024
person dharshininews
పోట్లీ మహారాజ్‌ దేవాలయానికి మహర్ధశ
పోట్లీ మహారాజ్‌ దేవాలయానికి మహర్ధశ - దేవాలయ పురోభివృద్ధికి కృషి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహరాజ్ దేవాలయాలనికి మహర్ధశ తీసుకవచ్చేలా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పోట్లీ మహరాజ్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన స్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ నరేందర్, చైర్మన్ భానుతో పాటు నేతలతో కలిసి పరిసర ప్రాంతాల్లో తిరిగి దేవాలయ ఆస్తులు, పరిరక్షణపై ఆరా తీశారు. అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోట్లీ మహరాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అందుకు తగిన నివేధికలు తీసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసేలా దృష్టిసారిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట వార్డు కౌన్సిలర్ విజయాదేవి, నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, వడ్డె శ్రీనివాస్, చెన్నారం అనిల్ కుమార్, కేవీసీఎస్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/24039/