schedule Tuesday, July 07, 2026

హిందువులారా.. రండి.. తరలిరండి..!

calendar_today February 23, 2024
person dharshininews
హిందువులారా.. రండి.. తరలిరండి..!
హిందువులారా.. రండి.. తరలిరండి..! - 25న హిందూ బందువుల ధార్మిక సమ్మేళనం - తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి: హిందుబందువులకు తాండూరు గోశాల సేవా సమితి ఓ పిలుపునిచ్చింది. ఈనెల 25న తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో హిందూ బంధువుల ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ సమ్మేళనం జరుగుతుందని చెప్పారు. హిందువులను జాగృతం చేయడం, హిందువులను సంఘటితం చేయడం, పండగలు, ఇతర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం, హిందువుల సంక్షేమం, అభ్యున్నతి, దాడులను అరికట్టడం వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చిండం జరుగుతుందన్నారు. కావున హిందు బందువులందరు అధిక సంఖ్యలో పాల్గొని సమె మమ్మిళాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24089/