schedule Saturday, September 12, 2026

తాగునీటి ఎద్దడి రానీయొద్దు

calendar_today February 23, 2024
person dharshininews
తాగునీటి ఎద్దడి రానీయొద్దు
తాగునీటి ఎద్దడి రానీయొద్దు - మిషన్ భగీరథను పూర్తి చేయండి - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకర్గంలో తాగునీటి ఎద్దడిని రానీయొద్దని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ లో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులపై ఆరా తీశారు. ఏయే ప్రాంతాల్లో పూర్తి కాలేదని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం సమీపిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాండూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మిగిలి పోయిన మిషన్ భగీరథ పనులను పూర్తి చేయించేలా దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నావంది పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24093/