schedule Saturday, September 12, 2026

అయోధ్యకు తాండూరు రామభక్తులు..!

calendar_today February 25, 2024
person dharshininews
అయోధ్యకు తాండూరు రామభక్తులు..!
అయోధ్యకు తాండూరు రామభక్తులు..! - ప్రత్యేక రైలు రవాణాను ప్రారంభించిన నేతలు - భక్తులను సాగనంపిన బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: అయోధ్యలోని రాముని దర్శనానికి తాండూరు రామ భక్తులు తరలివెళ్లారు. ఆదివారం తాండూరు మీదుగా అయోధ్యకు స్పెషల్ ట్రైన్ ఆస్తా రవాణా సౌకర్యం ప్రారంభమయ్యింది. దీంతోపాటు అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కూడా నెల రోజులు పూర్తి చేసుకోవడంతో తాండూరు నుంచి దాదాపు 300ల మంది భక్తులు అయోధ్యకు బయల్దేరి వెళ్లారు. అయోధ్య రైలును ప్రారంభించడంతో పాటు తాండూరు నుంచి బయల్దేరి వెల్లిన రామ భక్తులకు బీజేపీ నాయకులు ఘనంగా సాగనంపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, ఉపాధ్యక్షులు అంతారం లలిత, బాలి శివకుమార్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, గాజుల శాంతుకుమార్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24129/