schedule Tuesday, July 07, 2026

వాసవి మహిళా సంఘం నూతన కార్యవర్గం

calendar_today February 25, 2024
person dharshininews
వాసవి మహిళా సంఘం నూతన కార్యవర్గం
వాసవి మహిళా సంఘం నూతన కార్యవర్గం - రేపు కార్యవర్గ ప్రమాణ స్వీకారం - హాజరవుతున్న ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు శ్రీ వాసవీ మహిళ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. అధ్యక్షురాలుగా కోట్రిక నాగలక్ష్మీ, ఉపాధ్యక్షురాలుగా గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శురాలుగా మంకాల స్వప్న, ఉప కార్యదర్శురాలుగా తాళ్లపల్లి కవిత, కోశాధికారిగా సంగంశెట్టి శోభ, కార్యవర్గ సభ్యులుగా గుముడాల దీప, ముదేళ్లి శశిరేఖ, కల్వ అర్చన, లగిశెట్టి సంధ్య, ఆకుల లావణ్య, బిక్కుమాండ్ల శ్రీదేవి, దాదాపురం కవిత, వేముల దివ్య, కోట్రిక రజని, ఎదిరే సంతోషి, చిద్రి వీణ, కటకం పద్మజ, రేపాల పద్మ, కోట దీప, పూసల భాగ్యలక్ష్మీ, కౌకుంట్ల ప్రసన్న, బచ్చు సుధారాణి, కోడూరు జయశ్రీ, తర్లపల్లి శ్రీవాణి, కోడూరు విజయలక్ష్మీ, సలహదారులుగా లగిశెట్టి ప్రభావతి, మంతటి శంకరమ్మ, అయినాపురం అనిత, ముదేళ్లి సంగీత, కల్వ సరితలను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం చేత రేపు సోమవారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సంఘం అధ్యక్షురాలు కల్వ సరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళ విభాగ్ అధ్యక్షురాలు ఉప్పల శారధ, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బాలేశ్వర్ గుప్త, మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24145/