schedule Saturday, September 12, 2026

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటి

calendar_today February 26, 2024
person dharshininews
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటి
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటి - తాండూరు సమస్యలపై విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటి అయ్యారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం తాండూరు నియోజకవర్గంకు సంబంధించి పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకవెళ్లారు. తాండూరు ప్రాంత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత ఉన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24162/