హామిల అమలుకు పెద్దపీట
February 26, 2024
dharshininews
హామిల అమలుకు పెద్దపీట
- అర్హులందరికి గ్యాస్ సిలిండర్, విద్యుత్
- చేవేళ్ల బహిరంగ సభకు 20 వేల మంది
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం బిజ్ఞారం గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలను అమలు చేసిందన్నారు. నేడు మంగళవారం నుంచి మహిళలకు రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
ఇందులో భాగంగా నేడు చేవేళ్లలో నిర్వహించే బహిరంగ సభ జయప్రదానికి కృసి చేస్తున్నామన్నారు. తాండూరు నియోజకవర్గం నుంచి 20వేల మందిని బహిరంగ సభకు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మంబాపూర్ నారాయణరెడ్డి, కొమ్ము గోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..
https://dharshininews.com/24173/