schedule Tuesday, July 07, 2026

పారిశుద్ధ్యంపై ప్రత్యేక వాట్సాప్‌..!

calendar_today February 27, 2024
person dharshininews
పారిశుద్ధ్యంపై ప్రత్యేక వాట్సాప్‌..!
పారిశుద్ధ్యంపై ప్రత్యేక వాట్సాప్‌..! - ఆరు గంటల్లోనే సమస్యకు పరిష్కారం - హోటళ్లు, కల్తీ ఆహారంపై కూడా ఫిర్యాదు చేయొచ్చు - తాండూరు మున్సిపల్ అధికారుల ప్రత్యేక చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ ను కేటాయించారు. మంగళవారం మున్సిపల్ సిబ్బంది ఈ ప్రకటన చేశారు. పట్టణంలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్యలు ఉంటే ఈ నెంబర్‌ కు వాట్సాఫ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. కాలనీలో చెత్త కుప్పలు పేరుకుపోయినా, మురుగు కాలువలు శుభ్రం చేయకపోయినా, కార్మికులు చెత్తను తొలగించకపోయినా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చేందుకు అధికారులు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు వీధుల్లో కుక్కులు, పందులు, ఇతర జంతువులు చనిపోయినా తరలించేందుకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. మరోవైపు పట్టణంలో హోటళ్ల సమస్యలపై కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు. పరిసరల ప్రాంతాలు శుభ్రంగా లేకపోయినా, కల్తీ ఆహారం అందించిన ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు ఫిర్యాదు చేయాల్సిన వాట్సాప్‌ నెంబర్ 9000618568ను ప్రకటించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24178/