సాయంత్ర శానిటేషన్..!
February 27, 2024
dharshininews
సాయంత్ర శానిటేషన్..!
- చెత్త సేకరణకు ట్రాక్టర్లు
- రాత్రి వరకు చక్కర్లు
- కమీషనర్ ప్రత్యేక దృష్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో తిష్టవేసిన చెత్త సమస్యపై కదలిక తీసుకవచ్చేలా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. మంగళవారం పట్టణంలో మార్నింగ్ వాక్‌కు శ్రీకారం చుట్టారు. ఉదయమే కాకుండా సాయంత్రం కూడా శానిటేషన్ వ్యవస్థ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం పట్టణంలోని 24వ వార్డులో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి పర్యటించారు. వార్డులో డ్రైనేజీలో మురుగు తొలగింపు చేయించారు. మురుగు పారేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని కార్మికులకు సూచించారు.
అదేవిధంగా పట్టణంలో సాయింత్ర వేళలో చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. పట్టణంలోని కమర్షియల్ ప్రాంతాల్లో చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. కమర్షియల్ ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ట్రాక్టర్లకు అందించాలని సూచించారు. పట్టణాన్ని స్వచ్చతగా మార్చేందుకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ క్రిష్ణయ్య, జవాన్లు రవి, హరి, కార్మికులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..
https://dharshininews.com/24189/