schedule Sunday, September 13, 2026

వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి

calendar_today February 28, 2024
person dharshininews
వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి
వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - తాండూరులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర బ్యాంకును చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు ఆర్థిక వృద్ధిలో సాగాలని ఆకాంక్షించారు. బ్యాంకు ఖాతా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగుల విక్రమ్ సింహా రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ శుశాంత్ కుమార్ గుప్త, తాండూరు బ్రాంచు మేనేజర్ బి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24212/