schedule Sunday, July 05, 2026

అంగన్వాడీ, ప్రభుత్వ టీచర్లపై బెదిరింపులు

calendar_today February 29, 2024
person dharshininews
అంగన్వాడీ, ప్రభుత్వ టీచర్లపై బెదిరింపులు
అంగన్వాడీ, ప్రభుత్వ టీచర్లపై బెదిరింపులు - ఆరుగురు విలేకరులపై కేసులు - వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి: విలేకరుల ముసుగులో అంగన్ వాడి, ప్రైమరీ స్కూల్ టీచర్లపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామం లో జిల్లా స్టాఫ్ రిపోర్టర్లం అని చెప్పి ఆరుగురు వ్యక్తులు ఒక అంగన్వాడీ టీచర్‌తో పాటు ప్రైమరీ స్కూల్ టీచర్ ను బెదిరించి వారి నుండి డబ్బులు వసూలు చేశారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడిన 6 గురు వ్యక్తుల పైన నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/24239/