schedule Tuesday, July 07, 2026

ఈనెల 14న హనుమాన్ మండల దీక్షాధారణ

calendar_today March 10, 2024
person dharshininews
ఈనెల 14న హనుమాన్ మండల దీక్షాధారణ
ఈనెల 14న హనుమాన్ మండల దీక్షాధారణ - ఆహ్వానించిన హనుమాన్ దీక్ష సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 14న హనుమాన్ మండల దీక్షాధారణ నిర్వహిస్తున్నట్లు తాండూరు హనుమాన్ దీక్ష సమితి సభ్యులు మీదిపేట వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీక్ష సమితి ఆధ్వర్యంలో మండల దీక్ష మాలా ధారణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హనుమాన్ దీక్షతో అందరికి సత్ఫలితాలు సిద్దిస్తాయన్నారు. మాల ధారణలో సంప్రదాయ ఔనత్యం పెరుగుతుందన్నారు. మాల ధరించాలనుకునే భక్తులు సెల్ : 8978967484, 9848922825కు సంప్రదించాలన్నారు. మాల పూర్తయిన తరువాత నల్లమల్ల అడవుల్లోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శించుకుని పవనముడిని సమర్పించి దీక్షను విరమించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24342/