schedule Tuesday, July 07, 2026

కేటీఆర్ ప్రోగ్రాంలో చేంజ్..!

calendar_today March 14, 2024
person dharshininews
కేటీఆర్ ప్రోగ్రాంలో చేంజ్..!
కేటీఆర్ ప్రోగ్రాంలో చేంజ్..! - మార్పుకు కారణం ఏంటంటే..? - వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించనున్న ప్రోగ్రాంలో చిన్న మార్పు జరిగింది. ఇందుకు కారణాలను స్థానిక నేతలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 15వ తేదిన తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ వినాయక కన్వెన్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. కేటీఆర్‌తో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా పాల్గొంటారని ఇదివరకు నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు జరిగినట్లు గురువారం బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కోడ్‌ దృష్టిలో ఉంచుకుని మార్పు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు ఏ క్షణంలో అయినా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉండడంతో ప్రోగ్రాంలో మార్పుకు మరో కారణమని తెలిపారు. షెడ్యూల్ అనంతరం కార్యక్రమం నిర్వహణను ప్రకటిస్తామని వివరించారు. లోకల్ యాడ్... ఇది కూడా చదవండి... https://dharshininews.com/24367/