అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం..!
November 12, 2026
dharshininews
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం..!
- చలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
- అధైర్యపడొద్దు.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం
- బాధితురాలికి భరోసా అందించిన బీఎంఆర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై కష్టాల్లో పడిన బాధిత కుటుంబానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్) అండగా నిలిచారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా ఆదుకుంటానని బాధితురాలికి భరోసా కల్పించారు.
పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గృహిణి సమ్మమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి దగ్ధమై కుటుంబానికి నష్టం వాటిల్లింది.
విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు లోంక నర్సింహులు, సర్పంచ్ శివరాం నాయక్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు. జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేస్తూ, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సాయాన్ని అందేలా కృషి చేస్తానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.