గోమాత కల్యాణ మహోత్సవానికి రండి..!
November 12, 2026
dharshininews
గోమాత కల్యాణ మహోత్సవానికి రండి..!
- అంబత్రయ పీఠాధిపతికి ఆహ్వానం
- సందర్శించిన శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు గోశాలలో ఈ నెల 23న అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ గోమాత కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బిజ్వార్ గ్రామంలోని ప్రసిద్ధ అంబత్రయ క్షేత్రాన్ని శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు తమ మిత్రబృందంతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరస్వామి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు గోశాలలో ఈ నెల 23న నిర్వహించనున్న శ్రీ గోమాత కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ మేరకు స్వామివారికి మహోత్సవ వివరాలను తెలియజేసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
అంతకుముందు పీఠాధిపతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోశాల గౌరవాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, నాయకులు బంటు మల్లప్ప, సాగర్ గౌడ్, తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/45350/