చేనేత హస్తకళలు సంస్కృతికి అద్దం
March 19, 2024
dharshininews
చేనేత హస్తకళలు సంస్కృతికి అద్దం
- వాటిని ఆదరించడం అందరి బాధ్యత
- తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- పట్టణంలో హస్తకళా ప్రదర్శన ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేనేత హస్తకళలలు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రదర్శనకు ఉంచిన హస్తకళలను పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ హస్తకళలు మన దేశ సంస్కృతికి అద్దం పడతాయన్నారు. వివిధ రాష్ట్రా లకు చెందిన కళాకారులు ఒకే వేధికలో ఉంచిన హస్తకళలను ఆదరించడం అందరి బాధ్యత అన్నారు. ప్రదర్శనలో ఉంచిన దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులు ఆకట్టుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, బోయరవి, రాము, నాయకులు చెన్నారం అనిల్ గుప్త, వడ్డె శ్రీనివాస్, అజయ్ ప్రసాద్, దేవగారి రాములు, పోటీ మహరాజ్ దేవాలయ చైర్మన్ భాను, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోటం మురళీకృష్ణ, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/24455/