schedule Tuesday, July 07, 2026

రంజాన్ పండగకు అన్ని ఏర్పాట్లు

calendar_today March 19, 2024
person dharshininews
రంజాన్ పండగకు అన్ని ఏర్పాట్లు
రంజాన్ పండగకు అన్ని ఏర్పాట్లు - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఈద్గా మైదానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల పవిత్ర పండగ రంజాన్ కు అన్ని ఏర్పాట్లు చేసేలా చూస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ సమీపంలోని చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని ఈద్గా మైదానాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈద్గాలో ముస్లిం సోదరుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు రంజాన్ పండగకు ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పండగకు ఏర్పాట్లు పూర్తి చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు సర్దార్ ఖాన్, అజయ్ ప్రసాద్, ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24466/