schedule Sunday, September 13, 2026

రేపు కామదహనం, ఎల్లుండి హోలీ..!

calendar_today March 23, 2024
person dharshininews
రేపు కామదహనం, ఎల్లుండి హోలీ..!
రేపు కామదహనం, ఎల్లుండి హోలీ..! - ప్రకటించిన హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : హోలీ పర్వదినం సందర్భంగా రేపు ఆదివారం కామదహనం, ఎల్లుండి సోమవారం హోలీ పండగను జరుపుకోవాలని తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి సూచించింది. శనివారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ ప్రముఖ సిద్ధాంతి సిద్దిలింగయ్య స్వామితో హోలీ పర్వదిన నిర్వహణను పంచాంగం ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 9-54 గంటలకు పౌర్ణమి ప్రారంభమై అర్థరాత్రి 12, 1గంట సమయంలో ముగుస్తాయని చెప్పినట్లు తెలిపారు. కావున ప్రజలు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12-30 గంటల మద్య కామ దహనం జరుపుకోవాలని జరుపుకోవాలని సూచించారు. మరుసటి రోజు సోమవారం హోలీ పండగను సంప్రదాయంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజారి పాండు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24504/