schedule Tuesday, July 07, 2026

విశ్వకర్మలు జగత్తు సృష్టికర్తలు

calendar_today March 23, 2024
person dharshininews
విశ్వకర్మలు జగత్తు సృష్టికర్తలు
విశ్వకర్మలు జగత్తు సృష్టికర్తలు - గుడి, కోటల నిర్మాణంలో వారి నైపుణ్యం ప్రత్యేకం - బ్రహ్మంగారి గుట్ట అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో విశ్వకర్మలు జగత్తు సృష్టికర్తలుగా నిలుస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. శనివారం తాండూరు విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఖాంజాపూర్ గేటు సమీపంలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టెక్నాలజీ ఎంత పెరిగి విశ్వకర్మలు చేసే వృత్తికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. సమాజంలో దేవాలయాలు, కోటల నిర్మాణంలో విశ్వకర్మల కళానైపుణ్యం ప్రత్యేకమైందన్నారు. అందుకే విశ్వకర్మలు జగత్తు సృష్టికర్తలుగా నిలుస్తున్నారని అభివర్ణించారు. తాండూరులోని బ్రహ్మంగారి గుట్ట అభివృద్ధికి ప్రభుత్వ సహాకారంతో పాటు సొంతంగా తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా త్వరలో టాటా కన్సల్టెన్సీ సంస్థద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో విశ్వకర్మలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మురళీకృష్ణ గౌడ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, విశ్వకర్మ సమాజం సంఘం సభ్యులు గద్దె శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ చారి, సమాజం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24509/