schedule Tuesday, July 07, 2026

27న 5కే రన్‌ను సక్సెస్‌ చేయండి

calendar_today March 23, 2024
person dharshininews
27న 5కే రన్‌ను సక్సెస్‌ చేయండి
27న 5కే రన్‌ను సక్సెస్‌ చేయండి - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న నిర్వహిస్తున్న 5కే రన్ ప్రోగ్రాంను సక్సెస్స్ చేయాలని తాండూరు ఆర్డీఓ, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు కోరారు. శనివారం ఆర్డీఓ ఓ ప్రకటనలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు 5కే రస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే బుధవారం ఉదయం 6 గంటలకు పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు 5కే రన్ కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వందశాతం ఓటు హక్కు వినియోగించడంలో అవగాహన కల్పించడమే 5కే రన్ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థల సభ్యులు, యువతీ యువకులు, పట్టణ ప్రజలు, ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24513/