schedule Wednesday, September 16, 2026

గోశాల అభివృద్ధికి కృషి

calendar_today April 1, 2024
person dharshininews
గోశాల అభివృద్ధికి కృషి
గోశాల అభివృద్ధికి కృషి - నూతన అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి - గోశాలలో ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గోశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులు సాయిపూర్ పట్లోళ్ల బాల్‌రెడ్డి అన్నారు. గత నెల బాల్‌ రెడ్డిని నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఉదయం తాండూరు పట్టణం సీతారాంపేట్‌లోని గోశాలలో బాల్ రెడ్డి గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గోశాలలోని గోవులకు వేదపండితుల మంత్రోచ్చరణల మద్య పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోశాల అభివృద్ధితో పాటు గోవుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అందరు సహాకారంతో గోశాల ప్రతిష్టను పెంచుతామన్నారు. అదేవిధంగా గోశాలలో గోవుల కోసం పశుగ్రాసం, ఇతర దానాలు అందించాలని గోభక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్, కోశాధికారి మన్మోహన్ సార్డా, సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24589/