schedule Wednesday, September 16, 2026

వెయ్యి రెట్లు నేనే బెటర్..!

calendar_today April 1, 2024
person dharshininews
వెయ్యి రెట్లు నేనే బెటర్..!
వెయ్యి రెట్లు నేనే బెటర్..! - గుడ్ల స్కాం చేసింది అతనే - దేవులు భూములు అమ్ముకున్నాడు - ఓటమి భయంతోనే హస్తంలో చేరిక - సిట్టింగ్ ఎంపీపై మాజీ కొండా సంచనల విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల సిట్టింగ్ ఎంపీకన్నా నేనే వెయ్యి రెట్లు బెటర్ అని బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీపై సంచలనాత్మక విమర్శలు చేశారు. ఎంపీగా ఆయనకు ఏ గుర్తింపు లేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన సందర్భాలు లేవన్నారు. అందుకనే ఆయనకన్నా ఇంకా నేనే వెయ్యి రెట్లు బెటర్ అన్నారు. ఇంకా ప్రజలు తననే ఎంపీగా గుర్తించుకున్నారని అన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి గుడ్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. దేవాలయ భూములను అమ్ముకున్నారని, మరో దేవాలయ భూమిని బాంబ్ బ్లాస్ట్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోతారనే భయంతోనే హస్తం పార్టీలో చేశారని విమర్శించారు. మాజీ ఎంపీ కొండా సిట్టింగ్ ఎంపీపై చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24598/