schedule Tuesday, July 07, 2026

బీఆర్ఎస్ పార్టీకి షాక్..!

calendar_today April 4, 2024
person dharshininews
బీఆర్ఎస్ పార్టీకి షాక్..!
బీఆర్ఎస్ పార్టీకి షాక్..! - పట్టణ ప్ర.కార్యదర్శి సంతోష్ గౌడ్ రాజీనామా - పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరుడుగా గుర్తింపు - తిరిగి సొంతగూటికి చేరేందుకు ముహుర్తం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరుడుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా లేఖను పార్టీ పట్టణ అధ్యక్షులకు పంపినట్లు సంతోష్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంతోష్ గౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెంట కొనసాగారు. ఆ తరువాత పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సంతోష్ గౌడ్ కూడ చేరారు. అప్పటి నుంచి సంతోష్ గౌడ్ పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పైలెట్ రోహిత్ రెడ్డి పనిచేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంతోష్ గౌడ్ తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నట్లు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నిర్ణయాన్ని సంతోష్ గౌడ్ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24660/