schedule Thursday, September 17, 2026

చెక్‌డ్యాంలో యువకుడి మృతదేహం

calendar_today April 5, 2024
person dharshininews
చెక్‌డ్యాంలో యువకుడి మృతదేహం
చెక్‌డ్యాంలో యువకుడి మృతదేహం - కర్ణాటక రాష్ట్ర సరిహద్దు శివారులో ఘటన - మృతుడు బషీరాబాద్‌ అల్లాపూర్‌ వాసి బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని చెక్‌ డ్యాంలో ఓ యువకుడు మృతదేహాంగా లభ్యమైన సంఘటన బషీరాబాద్‌ మండలం అల్లాపూర్ గ్రామంలో విషాదం నింపింది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం గ్రామంలో జరిగిన వివాహానికి వచ్చిన స్నేహితులతో కలిసి గ్రామానికి చెందిన రుద్రారం రమేష్‌(30) బయటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం జెట్టూరు శివారులోని చెక్‌ డ్యాంలో రమేష్‌ మృతదేహంగా లభ్యమయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గ్రామానికి తీసుకవచ్చారు. కుమారుడు మృతి చెందడంతో తండ్రి ఆశన్న, తల్లి సత్యమ్మ, భార్య, కుటుంభీకులు బోరున విలపించారు. మృతునికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనపై బషీరాబాద్‌ పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25122/