schedule Tuesday, July 07, 2026

తాండూరుకు వేం నరేందర్ రెడ్డి రాక

calendar_today April 12, 2024
person dharshininews
తాండూరుకు వేం నరేందర్ రెడ్డి రాక
తాండూరుకు వేం నరేందర్ రెడ్డి రాక - కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఏర్పాట్లు - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు, చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ వేం నరేందర్ రెడ్డి శనివారం తాండూరుకు వస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శనివారం ఉదయం 11గంటలకు పట్టణ శివారు జీపీఆర్ గార్డెన్ లో సమావె శం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర సీఎం సలహదారుడు, చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ వేం నరేందర్ రెడ్డి. చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిలు హాజరవుతున్నారని వెల్లడించారు. కావున ఈ సమావేశానికి తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25445/