schedule Wednesday, July 08, 2026

భద్రేశ్వర జాతర యంత్రాల వేలంకు స్పందన

calendar_today April 13, 2024
person dharshininews
భద్రేశ్వర జాతర యంత్రాల వేలంకు స్పందన
భద్రేశ్వర జాతర యంత్రాల వేలంకు స్పందన - భారీ మొత్తానికి దక్కించుకున్న వ్యాపారి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో యంత్రాలు, ఆట వస్తువుల ప్రదర్శన కోసం నిర్వహించిన వేలానికి స్పందన లభించింది. శనివారం ఆలయంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ వేలంలో 8 మంది వ్యాపారులు పోటీ పట్టారు. నిబంధనల ప్రకారం వారు రూ. 10వేల ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. రూ. 5లక్షల నుంచి వేలం ప్రారంభం ఆర్‌కే రజాన్ అనే వ్యాపారి రూ. 7లక్షల 75వేలకు యంత్రాలు, రంగుల రాట్నం, ఇతర వస్తువుల ప్రదర్శనను దక్కించుకున్నారు. జాతర ఉత్సవాలు ముగిసే వరకు అతను యంత్రాలను ప్రదర్శిస్తారని దేవదాయ శాఖ ఈఓ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25506/