schedule Wednesday, July 08, 2026

హస్తంలో గెలుపు జోష్‌ తెస్తాం..!

calendar_today April 13, 2024
person dharshininews
హస్తంలో గెలుపు జోష్‌ తెస్తాం..!
హస్తంలో గెలుపు జోష్‌ తెస్తాం..! - వేం నరేందర్ రెడ్డికి ఘన సత్కారం - సన్మానించిన రవీందర్ గౌడ్, మేఘనాథ్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : హస్తం పార్టీలో పార్లెమంట్ గెలుపు జోష్‌ తీసుకవస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం సలహాదారులు, పార్లమెంట్ ఇంచార్జ్ వేం నరేందర్ రెడ్డికి డీసీసీబీ జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్, తాండూరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు సంగెం మేఘనాథ్‌ గౌడ్‌లు అన్నారు. శనివారం తాండూరు పట్టణ శివారు జీపీఆర్ గార్డెన్‌లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారులు, చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ వేం నరేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలను డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మేఘనాథ్‌ గౌడ్‌లు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి పిలుపు మేరకు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో హస్తం గెలుపు జోష్‌ను తీసుకవస్తామన్నారు. అందరం సైనికుల్లా పనిచేసి అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25515/