schedule Wednesday, July 08, 2026

ఆదర్శనీయుడు అంబేద్కర్‌

calendar_today April 14, 2024
person dharshininews
ఆదర్శనీయుడు అంబేద్కర్‌
ఆదర్శనీయుడు అంబేద్కర్‌ - ఆశయ సాధనకు అందరు కృషి చేయాలి - డీసీసీబీ జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్ - అంతారంలో ఘనంగా జయంతి వేడుకలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ ఆదర్శనీయుడని డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు మండలం అంతారం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ ఎస్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, గ్రామ ఎంపీటీసీ శాంతు కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం ప్రకాష్, సహకార సంఘం డైరెక్టర్ పెండా నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ జీవరత్నం తదితరులు హాజరై అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే అందరికి సమాన హక్కులు పొందుతున్నారని అన్నారు. దేశానికి అంబేద్కర్ ఆదర్శప్రాయుడుగా నిలిచారని, ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మ్యాతరి బెంజిమెన్, ఎల్లప్ప, బొడ్డె అనంతయ్య, తుమ్మనపల్లి నర్సప్ప, జంగని, నర్సింలు, సంగెం శ్రీనివాస్, పలు పార్టీల నేతలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25521/