schedule Wednesday, July 08, 2026

లారీ డ్రైవర్‌కు కష్టమొచ్చింది..!

calendar_today April 15, 2024
person dharshininews
లారీ డ్రైవర్‌కు కష్టమొచ్చింది..!
లారీ డ్రైవర్‌కు కష్టమొచ్చింది..! - మూడు రోజుల క్రితం వర్షానికి కూలిన ఇళ్లు - శిథిలాలే కిందే ఇంటి సామాగ్రి - సాయం అందించాలని వేడుకోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రోజు కష్టపడి పనిచేసుకునే లారీ డ్రైవర్‌పై ప్రకృతి పగపట్టింది. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి అతని ఇళ్లు కుప్పకూలి పోయింది. ఇంటి సామాగ్రి మొత్తం శిథిలాల కింద మిగిలిపోయింది. తనకు జరిగిన నష్టానికి బాధితుడు తీవ్రంగా కుమిలిపోతున్నాడు. తనకు సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం 1వ వార్డుకు చెందిన మోయిన్ ఖాన్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం డ్రైవింగ్ పనికి వెల్లగా అదే రోజు కురిసిన వర్షానికి ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇంటి పైకప్పు పూర్తిగా కుప్పకూలి పోవడంతో సామాగ్రి మొత్తం శిథిలాల కింద మిగిలిపోయింది. దీంతో మూడు రోజులుగా లారీ డ్రైవర్ మోయిన్ ఖాన్ కుటుంభీకులు అవస్థలు పడుతున్నారు. బాధితుడు మాట్లాడుతూ వర్షం కారణంగా జరిగిన నష్టంతో తేరుకోలేక పోతున్నామని అన్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ఆదుకోవాలని కోరుతున్నాడు. పార్టీ నేతలు, మైనార్టీ పెద్దలు తనకు సాయం అందించాలని వేడుకుంటున్నాడు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25584/