schedule Wednesday, July 08, 2026

అట్టహాసంగా పటేల్ కిరణ్ జన్మదినం

calendar_today April 17, 2024
person dharshininews
అట్టహాసంగా పటేల్ కిరణ్ జన్మదినం
అట్టహాసంగా పటేల్ కిరణ్ జన్మదినం - శుభాకాంక్షలు తెలిపిన ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి - సన్మానించిన ఆర్బీఎల్ ఎండీ సరళారెడ్డి - కేక్‌ కట్ చేయించిన సన్నిహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ది గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కోశాధికారి, వీరశైవ యువదళ్ సభ్యులు పటేల్ కిరణ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం కుటుంబీకులు, సన్నిహితుల ఆధ్వర్యంలో పటేల్ కిరణ్‌ జన్మదినాన్ని జరుపుకున్నారు. పటేల్ కిరణ్‌ కుమార్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, ఆర్బీఎల్ ఫ్యాక్టరీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళారెడ్డిలు శుభాకాంక్షలు తెలిపి శాలువా, పూల బెకె అందించి సత్కరించారు. అదేవిధంగా తండ్రి వీరశైవ సమాజం సభ్యులు పటేల్ శ్రీశైలం, పలువురు వ్యాపారులు, సమాజం సభ్యులు తదితరులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా స్నేహితులు, సన్నిహితులు పటేల్‌ కిరణ్‌ను సన్మానించి ఆయన చేత కేక్‌ కట్ చేయించారు. కుటుంబ సభ్యులు, నేతలు, అభిమానులు పటేల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలను వెల్లువలా తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25631/