schedule Tuesday, September 15, 2026

ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు సన్మానం

calendar_today April 18, 2024
person dharshininews
ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు సన్మానం
ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు సన్మానం - శుభాకాంక్షలు తెలిపిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులను గురువారం శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 2024-2026 నూతన కార్యవవర్గం ఇటీవల పదవి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా అసోయోషియేషన్ గౌరవ అధ్యక్షులు కిరణ్ కుమార్, అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ కృష్ణ గౌడ్, సహకార దర్శి శివకుమార్, కోశాధికారి సతీష్, మీడియా ఇంచార్జ్ అభిలాష్ రెడ్డి తో పాటు కార్యవర్గ సభ్యులు కల్పన, సునీత, కవితలకు శుభాకాంక్షలు తెలిపారు. సాయిమేధా పాఠశాలలో అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. తాండూరులోని ప్రైవేటు స్కూల్‌ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25654/