schedule Tuesday, September 15, 2026

హస్తంలో చేరిన హరిగౌడ్

calendar_today April 19, 2024
person dharshininews
హస్తంలో చేరిన హరిగౌడ్
హస్తంలో చేరిన హరిగౌడ్ - ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ ముఖ్య అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు హరిగౌడ్ హస్తం గూటికి చేరుకున్నారు. శుక్రవారం బాషీరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తాండూరు ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్స్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా హారీగౌడ్ మాట్లాడుతూ ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ రంజిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, డిసిసిబి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, నాయకులు అజయ్ ప్రసాద్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/25665/