schedule Tuesday, July 07, 2026

సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ

calendar_today April 25, 2024
person dharshininews
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ - బూత్‌ స్థాయి ఎజెంట్ల నియామకానికి ఆదేశం - పకడ్బందీగా స్లిప్పుల పంపిణీ - బషీరాబాద్‌ మండల తహసీల్దార్ వెంకటేష్‌ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని బషీరాబాద్‌ తహసీల్దార్ వెంకటేష్‌ అన్నారు. గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలు, బీఎల్వోలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. ముందుగా రాజకీయ పార్టీల నేతలతో తహసీల్దార్ ఎన్నికల నిర్వహణఫై సమీక్షించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో పార్టీల నేతలు బూతు స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. అదేవిధంగా బీఎల్వోలతో తహసీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు శనివారం నుంచి స్లిప్పుల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో స్లిప్పుల పంపిణీ ప్ర్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25758/