schedule Tuesday, July 07, 2026

భారీ మెజార్టీ ఇవ్వండి..!

calendar_today May 2, 2024
person dharshininews
భారీ మెజార్టీ ఇవ్వండి..!
భారీ మెజార్టీ ఇవ్వండి..! - ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం - ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని ఆ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు కోరారు. గురువారం తాండూరు పట్టణంలోని సీతారాంపేట్, గుమాస్తా నగర్, వాసవీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇట్టి ప్రచారంలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి అప్యాయంగా పలకరించారు. కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచి హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. జనంలోకి వచ్చిన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రజలు సాదరంగా స్వాగతించారు. వారి ప్రచారానికి స్పందించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని అన్నారు. ఎన్నికల. తరువాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓబీ సెల్ కన్వినర్ సునీతాసంపత్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, మాజీ కౌన్సిలర్ పరిమళ, మహిళ నాయకురాలు మాధవి, ఆయా వార్డుల పెద్దలు, కార్యకర్తలు:. పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26171/