schedule Tuesday, July 07, 2026

బీఆర్ఎస్ పార్టీకి షాక్...!

calendar_today May 9, 2024
person dharshininews
బీఆర్ఎస్ పార్టీకి షాక్...!
బీఆర్ఎస్ పార్టీకి షాక్...! - కాంగ్రెస్‌లో చేరిన విఠల్ నాయక్ - ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా వేసుకున్నారు. విఠల్ నాయక్ నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పీ హస్తంలోకి ఆహ్వానించారు. ముందు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన విఠల్ నాయక్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత మహేందర్ రెడ్డిని వీడి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలో చేరారు. రోహిత్ రెడ్డి హాయంలో విఠల్ నాయక్ తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవిని పొందారు. రెండేళ్ల పాటు మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేశారు. తరువాత రోహిత్ రెడ్డి వెంట ఉన్న విఠల్ నాయక్ తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు నర్సింలు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు హన్మంతు ముదిరాజ్, గురురాజ్ జోషి తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/26302/