schedule Sunday, September 13, 2026

ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

calendar_today May 12, 2024
person dharshininews
ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - పదేళ్ల జ్ఞాపకాలను పంచుకున్న విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం న్యూ నలంద పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం సాయంత్రం పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ లో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చదువుకునే సమయంలో జరిగిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను శాలువా పూలమాలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పదేళ్ల తర్వాత అందరూ ఒకే చోట కలుసుకొని ఎవరికివారు బాగోగులు తెలుసుకొని గడపడం మానసికంగా సంతోషాన్నిచ్చిందని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఎవరికి ఇబ్బందులు ఉన్నా సమాచారం అందుకొని సహకరించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26399/