schedule Saturday, September 12, 2026

మరోప్రాణం పోవొద్దు..!

calendar_today May 16, 2024
person dharshininews
మరోప్రాణం పోవొద్దు..!
మరోప్రాణం పోవొద్దు..! - కుక్కల బెడద నివారించండి - తాండూరు బీజేపీ నేతల డిమాండ్‌ - మున్సిపల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : కుక్కల వల్ల మనషుల ప్రాణాలు, గాయాలు కాకుండా బాధ్యత చర్యలు తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఓ కుక్క దాడిలో 5నెలల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. కుక్కల గుంపుల వల్ల పలు ప్రాంతాల్లో చిన్నారులు గాయాలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గురువారం బీజేపీ నేతలు తాండూరు మున్సిపల్ కమీషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. తాండూరులో రోజు రోజు పెరుగుతున్న వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. 5నెలల బాలుడు కుక్క క్రూరత్వానికి బలైన సంఘటనను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో పెరుగుతూ పోతున్న కుక్కల గుంపులను నియంత్రించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కల నుంచి మరో ప్రాణం కుండా, ఎవ్వరికి గాయాలు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, వైస్ ప్రెసిడెంట్ దోమ కృష్ణ, సీనియర్ నాయకులు మంతటి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శ కిరణ్ ముదిరాజ్, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26517/