schedule Tuesday, July 07, 2026

నమో వాసవీ మాత..!

calendar_today May 17, 2024
person dharshininews
నమో వాసవీ మాత..!
నమో వాసవీ మాత..! - ప్రారంభమైన జయంతి ఉత్సవాలు - జయప్రదం చేయాలని సంఘాల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. శుక్రవారం నుంచి తాండూరులో వాసవి మాత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య సంఘం, శ్రీ నగరేశ్వర దేవస్థాన పాలక మండలి, వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సేవాదళ్, యువజన సంఘం, వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, నగరేశ్వర భజన మండలిల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వెలసిన శ్రీ వాసవీ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం ఆలయంలో గణపతిపూజ, చండీయాగం నిర్వహించారు. రేపు శనివారం అమృత కళశములతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి సగరేశ్వర దేవాలయం వరకు ఊరేగింపు, కన్యకా పరమేరశ్వరీ మాతకు క్షీరాభిషేకం, జలాభిషేకం, కుంకుమార్చన, డోలారోణ కార్యక్రమాలు : నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మహాప్రసాదం, సాయంత్రం కన్యకాపరమేశ్వరి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆర్యవైశ్య సంఘం. నగరేశ్వర దేవాలయ పాలకమండలితో పాటు వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సేవాదళ్, యువజన సంఘం. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, నగరేశ్వర భజన మండలిల సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26537/