schedule Sunday, September 13, 2026

రెప్పేసీ.. రాషింగ్ డ్యాష్‌..!

calendar_today July 2, 2024
person dharshininews
రెప్పేసీ.. రాషింగ్ డ్యాష్‌..!
chai jrరెప్పేసీ.. రాషింగ్ డ్యాష్‌..! - డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ - నిద్రమత్తులో డ్రైవర్ నిర్వాకం - తాండూరులో సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ చిన్న రెప్పేడంతో రాషింగ్‌ డ్రైవింగ్‌ వల్ల డివైడర్‌కు డ్యాష్ ఇచ్చాడు. అమాంతం లారీ మొత్తం డివైడర్ మద్యలోకి దూసుకెళ్లింది. లారీ ధ్వంసం కావడంతో పాటు డివైడర్ రీలింగ్స్ విరిగిపడ్డాయి. ఈ సంఘటన తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో చోటు చేసుకుంది. వెంటకయ్య అనే లారీ డ్రైవర్ చెట్టినాడ్‌ ఫ్యాక్టరీ నుంచి తాండూరు పట్టణం మీదుగా షాద్‌ నగర్‌ వెళుతున్నాడు. మంగళవారం తెల్లవారు జామున పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ దాటగానే నిద్రమత్తులో ఉన్న వెంకటయ్య రెప్ప వేయడంతో లారీ అదుపు తప్పి డివైడర్‌ మీదకు దూసుకెళ్లింది. లారీ మొత్తం డివైడర్‌ ఎక్కేసింది. డివైడర్‌పై ఉన్న రీలీంగ్స్ మొత్తం విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ యంత్రంతో లారీని పక్కకు తొలగించారు. జరిగిన సంఘటనపై పట్టణ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/27522/