schedule Tuesday, July 07, 2026

డా.జయప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today October 8, 2024
person dharshininews
డా.జయప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
డా.జయప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - తండ్రి పరంధాములు నివాళులు - కుటుంబ సభ్యులకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు జయప్రసాద్ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. డా.జయప్రసాద్ తండ్రి ఎం.పరంధాములు(రిటైర్డ్ డీఏఓ-సంగారెడ్డి) ఇటీవల స్వర్గస్తులు అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డా.జయప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. జయప్రసాద్ ను కలిసి పరామర్శించారు. అంతకుముందు పరంధాములు చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, డా. సంపత్ కుమార్, కరణం పురుషోత్తంరావు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29618/