schedule Friday, September 11, 2026

కట్టమైసమ్మ వెండి కీరీటంకు చేయూత

calendar_today October 8, 2024
person dharshininews
కట్టమైసమ్మ వెండి కీరీటంకు చేయూత
కట్టమైసమ్మ వెండి కీరీటంకు చేయూత - రూ. 1 లక్ష 11 వేలు అందించిన విఠల్ నాయక్ - ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి వెండి కీరీటం కోసం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ చేయూత అందించారు. మంగళవారం ఆలయ కమిటి సభ్యులకు తన వంతు సహాకారం కింద అమ్మవారి తల వెండి కీరీటం కొనుగోలు చేసేందుకు రూ. 1 లక్ష 11 వేల రూపాలను అందజేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ దేవీ నవరాత్రులు, విజయదశమి సందర్భంగా తన వంతు సహాకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బి.నరేష్, ఉపాధ్యక్షులు కంఠం నవీన్, కోశాధికారి వేణుగోపాల్, కమిటి సభ్యులు సుధాకర్, పట్నం రమేష్, అంజిలయ్య, వెంకటయ్య, నాగప్ప, ఉప్పు సిద్దన్న, భాస్కర్ రెడ్డి, ఆలయ పూజారి చందు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29621/