మురికి సాయిపూర్..!
October 10, 2024
dharshininews
మురికి సాయిపూర్..!
- చిన్న వర్షానికే రోడ్లపైకి మురుగు
- కంపుతో కాలనీ వాసుల ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ మురికిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. ఈ చిన్నపాటి వర్షానికి సాయిపూర్లోని పలు ప్రాంతాల రహదారులు జలమయం అయ్యాయి. ఆయా కాలనీలలో మురుగు కాలువలు ఉప్పొంగడంతో మురుగు అంతా రోడ్లపైకి చేరింది. వర్షపునీరు, మురుగు కలిసి రోడ్లపై ప్రవహించాయి. దీంతో రోడ్లంతా కంపుమయంగా మారాయి. రోడ్లపై మురుగు నీరు ప్రవాహాం, కంపుతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రోడ్లపై నీరు నిలవడంతో మరోసారి చిలుకవాగు అంశం చర్చనీయాంశమైంది. పాలకులు, అధికారులు స్పందించి ఇంకోసారి సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/29683/