schedule Friday, September 11, 2026

డా.జయప్రసాద్‌కు పైలెట్ పరామర్శ

calendar_today October 11, 2024
person dharshininews
డా.జయప్రసాద్‌కు పైలెట్ పరామర్శ
డా.జయప్రసాద్‌కు పైలెట్ పరామర్శ - ఇంటికి వెళ్లి సానుభూతి తెలిపిన రోహిత్ రెడ్డి - పలువురు మృతుల కుటుంబాలకు ఓదార్పు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు జయప్రసాద్‌ను తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి పరామర్శించారు. డా.జయప్రసాద్ తండ్రి ఎం.పరంధాములు(రిటైర్డ్ డీఏఓ-సంగారెడ్డి) ఇటీవల స్వర్గస్తులు అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న రోహిత్ రెడ్డి డా.జయప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. జయప్రసాద్ ను కలిసి పరామర్శించారు. అంతకుముందు పరంధాములు చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మరోవైపు పట్టణంలోని పలువురు మృతుల కుటుంబాలను రోహిత్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట తాండూరు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29692/