schedule Tuesday, July 07, 2026

మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..!

calendar_today October 11, 2024
person dharshininews
మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..!
మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..! - మదినిండుగా పూజించిన భక్తులు - ఆకట్టుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు - నగరేశ్వరా దేవాలయంలో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ మాత మహిసాసుర మర్దిణిగా దర్శనమిచ్చారు. వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం తొమ్మిదవ రోజు సందర్భంగా ఆలయంలోని అమ్మవారిని మహిసాసుర మర్దిణి అమ్మవారుగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళ భక్తులు అమ్మవారిని మహిసాసుర మర్దిణి శ్లోకాలతో కీర్తించారు. పారాయణాలతో మదినిండు భక్తితో సల్లంగా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం సంఘాల ఆధ్వర్యంలో పలు సంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు తాండూరు కాంగ్రెస్ నాయకురాలు, ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి, పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. సంఘం ఆధ్వర్యంలో సరళా శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. అదేవిధంగా సాంస్కృతిక పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. శరన్నవరాత్రి పూజలు, కార్యక్రమాలతో దేవాలయం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్‌ లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, వాసవీ మహిళ సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29717/