schedule Friday, September 11, 2026

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..!

calendar_today October 14, 2024
person dharshininews
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..!
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..! - కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రావద్దు - పంటల నమోదుపై క్షేత్రస్థాయిలో దృష్టిసారించాలి - సమీక్షా సమావేశంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఉద్యావన శాఖ సివిల్ సప్లయ్ శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సమీక్ష జరిపారు. జిల్లాలో 125 ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటు చేయగా వాటికి సబంధించిన సమగ్ర వివరాలను అందజేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్రాలకు సంబంధించి సమగ్ర వివరాలను అందజేయాలని అన్నారు. అదేవిధంగా రైతులు పంటల నమోదు చేసుకునేందుకు ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29756/