schedule Tuesday, July 07, 2026

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!

calendar_today October 15, 2024
person dharshininews
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! - తాండూరు మీదుగా కొత్త రైళ్ల సర్వీసు - తిరుపతి, బెల్గావి మద్య రవాణా - ప్రకటించిన దక్షిణ మద్య రైల్వే శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు, వికారాబాద్‌ రైల్వే ప్రయాణికులకు దక్షిణమద్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. తాండూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రైలు నెంబర్ 07621 జల్న నుంచి తిరుపతికి, రైలు నెంబర్ 07622 తిరుపతి నుంచి జల్న, రైలు నెంబర్ 07335 బెల్గావి నుంచి మణుగురు, రైలు నెంబర్ 07336 మణుగురు నుంచి బెల్గావి మద్య సర్వీసు అందిస్తాయని వెల్లడించారు. రెండు రైళ్లు 18 కోచ్‌ల చొప్పున నడుస్తాయని తెలిపారు. బెల్గావి రైలు సోమ, గురు, ఆది, బుధవారాలు తాండూరు మీదుగా నడుస్తుందని తెలిపారు. జల్నా రైలు ఈనెల 21, 28, నవంబర్ 4 నడుస్తుందని తెలిపారు. వచ్చే యేడాది 2025 మార్చి వరకు రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ రెండు రైళ్లు ప్రయాణించే రైట్లను కింద చూడవచ్చు.. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29763/